కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ ఇంజినీరు ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ఒంటిచేయితో యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరు అయిన వీరప్ప అరికెరి... నగరంలోని ఇళ్లిళ్లు తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల తలెత్తే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కంప్యూటర్ శిక్షణను ఇచ్చే అరికెరి.. దానితో పాటుగా కుట్టు మిషన్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. ఇలా అనేక వృత్తులు చేపట్టి వచ్చిన ధనాన్ని ప్రజలు తనకు అందించే ప్లాస్టిక్కు ప్రతిగా అందిస్తున్నాడు అరికెరి.
''ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా వినాశనం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. మన భవిష్యత్తుకు ఏం జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ కారణంగా నేను ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ప్రారంభించాను. ఇలా నేను గత ఐదేళ్లుగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతాల్లోని మహిళలు సహకారం అందిస్తున్నారు. దీంతో ఈ మహిళలు నాకు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు, పర్యావరణానికి మేలు చేస్తున్నారు.''
-వీరప్ప అరికెరి, పర్యావరణ ఉద్యమకారుడు
అయితే అరికెరి ఉద్యమానికి మొదట్లో సరైన స్పందన లభించలేదు. అయితే ఇది సఫలం కాదని చాలామంది వ్యాఖ్యానించారు. ఎవరేమన్నప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు లక్షించాడు వీరప్ప. ఒంటరిగా సాధించిన ఫలితాలను చూసి ఆయనతో అంతా సహకరించడం ప్రారంభించారు.
''ఆయన చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కుటుంబం సహకరించనప్పటికీ ఈ పని చేయడం అంత సులభం కాదు. వ్యర్థాలను సేకరించేటప్పుడు అంత సరైన అభిప్రాయం కూడా ఉండదు. ఇలా పలు రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని వీడలేదు. ఇదంతా చూసి ఆయనకు సహకరించడం ప్రారంభించాం.''