ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా... కరోనాపై విజయం సాధించేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు షా.
'ప్రధాని చెప్పినట్టు చేస్తే కరోనాపై విజయం' - కరోనాపై అమిత్‌షా
కరోనాను జయించేందుకు ప్రజలంతా ఏకమవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపునకు అందరూ సహకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.
ప్రధాని కోరిన విధంగా ప్రజలంతా ఏకమవ్వాలి: అమిత్ షా
కరోనాపై పోరులో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడమే మన దగ్గరున్న అస్త్రాలని గుర్తుచేశారు అమిత్ షా.