తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ అడ్డాలో నేడు అమిత్​ షా 'సీఏఏ' ర్యాలీ - భాజపా వర్గాలు

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నేడు పశ్చిమ్​ బంగలో పర్యటించనున్నారు. కోల్​కతాలోని షాహీద్​ మినార్​ మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. పౌరసత్వ సవరణ చట్టం చుట్టూ నెలకొన్న గందరగోళాన్ని ప్రజల నుంచి పోగొట్టే ప్రయత్నం చేయనున్నట్లు వెల్లడించాయి భాజపా వర్గాలు.

Amit Shah to visit Kolkata tomorrow to 'clear confusion' on CAA
దీదీ అడ్డాలో నేడు అమిత్​ షా 'సీఏఏ' ర్యాలీ

By

Published : Mar 1, 2020, 5:11 AM IST

Updated : Mar 3, 2020, 12:46 AM IST

బంగాల్​లో పర్యటించనున్న అమిత్​ షా

పౌరసత్వ సవరణ చట్టం చుట్టూ నెలకొన్న గందరగోళంపై స్పష్టతనిచ్చేందుకు నేడు బంగాల్​లో పర్యటించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. కోల్​కతాలోని షాహీద్​ మినార్​ మైదానంలో సీఏఏపై జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. పౌర చట్టంపై సందేహాలను నివృత్తి చేయనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.

''తృణమూల్​ కాంగ్రెస్​ ప్రభుత్వం పౌర చట్టంపై ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. అమిత్​ షా.. ఆ అంశంపై స్పష్టతనిస్తారు. టీఎంసీ నేతలకు షా సరైన సమాధానమిస్తారు.''

- బంగాల్​ భాజపా సీనియర్​ నేత

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సభకు హాజరుకానున్నారు. పౌర చట్ట రూపకల్పన, ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన అమిత్​ షాను ఈ సందర్భంగా సన్మానించనున్నారు భాజపా నేతలు.

కాళీ ఘాట్​కు షా...

కోల్​కతాలోని రాజార్​హాట్​లో నిర్మించిన నేషనల్​ సెక్యూరిటీ గార్డ్స్​(ఎన్​ఎస్​జీ) నూతన భవనాన్ని అమిత్​ షా ప్రారంభిస్తారు. త్వరలో కోల్​కతా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... భాజపా బంగాల్​ విభాగంతో షా, నడ్డా అంతర్గత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా.. కోల్​కతాలోని ప్రసిద్ధ కాళీ ఘాట్​ను కూడా షా సందర్శిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి.

Last Updated : Mar 3, 2020, 12:46 AM IST

ABOUT THE AUTHOR

...view details