తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాధ్యతలు చేపట్టిన అమిత్​షా, రాజ్​నాథ్​

కేంద్రమంత్రులు అమిత్​షా హోం శాఖ, రాజ్​నాథ్​సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖల పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు పర్యావరణం, అటవీ, వాతావరణశాఖ మంత్రిగా ప్రకాశ్ జావడేకర్ బాధ్యతలు స్వీకరించారు.

By

Published : Jun 1, 2019, 1:25 PM IST

Updated : Jun 1, 2019, 2:09 PM IST

బాధ్యతలు చేపట్టిన అమిత్​షా, రాజ్​నాథ్​

బాధ్యతలు చేపట్టిన అమిత్​షా, రాజ్​నాథ్​

కేంద్ర హోంమంత్రిగా అమిత్​షా, రక్షణ మంత్రిగా రాజ్​నాథ్​ సింగ్​ నేడు బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని విజయతీరాలకు చేర్చిన షా... కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టారు.

దిల్లీ నార్త్​బ్లాక్​లోని హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న 'అమిత్​ షా'కు.. హోం కార్యదర్శి రాజీవ్​గౌబా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమిత్​షాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా కిషన్​రెడ్డి, నిత్యానందరాయ్​లు కూడా బాధ్యతలు స్వీకరించారు.

నూతన బాధ్యతల్లోకి..

గత ఎన్డీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన రాజ్​నాథ్​... తాజాగా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నూతన రక్షణ మంత్రిని త్రివిధ దళాధిపతులు.. బిపిన్​ రావత్​, బీఎస్ ధనోవా, కరమ్​బీర్​ సంగ్​ మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు.

పర్యావరణాన్ని పరిరక్షిస్తా..

పర్యావరణం, అటవీ, వాతావరణశాఖ మంత్రిగా ప్రకాశ్ జావడేకర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధినీ ఏకకాలంలో సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సహాయ మంత్రిగా బాబుల్​ సుప్రియో బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా

Last Updated : Jun 1, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details