తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' - కోల్​కతాలో అమిత్ షా

Amith Shah two day Visit in Kolkata
బంగాల్ పర్యటనలో అమిత్ షా

By

Published : Dec 19, 2020, 10:44 AM IST

Updated : Dec 19, 2020, 4:04 PM IST

15:52 December 19

200 సీట్లు గెలుస్తాం..

బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా..  అధికార టీఎంసీ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్​ నేతలు టీఎంసీని వీడుతున్నారని, ఎన్నికల నాటికి మమతా బెనర్జీ ఒక్కరే ఆ పార్టీలో మిగులుతారని జోస్యం చెప్పారు.

మిద్నాపోర్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీఎంసీ నేతల చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు షా. ప్రలోభాలతో తమ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని భాజపాపై దీదీ ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చి టీఎంసీ పార్టీని ఏర్పాటు చేయటం ఫిరాయింపు కాదా? అని ప్రశ్నించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. ఎన్నికల నాటికి బంగాల్​ రాజకీయ చిత్రం మారిపోతుందన్నారు.

" విధాన సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే.. 200కుపైగా సీట్లతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సీనియర్ నేతలు టీఎంసీని వీడుతున్నారు. మీరు మూడు దశాబ్దాలు కాంగ్రెస్​కు, 27 సంవత్సరాలు కమ్యూనిస్టులకు, 10 ఏళ్లు మమతా దీదీకి అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. బంగాల్​ను స్వర్ణ ప్యాలెస్​లా తీర్చిదిద్దుతాం."

              - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు షా. తన అల్లుడిని తదుపరి ముఖ్యమంత్రి చేసే పనిలో దీదీ బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో హింసకు ఎంతగా పాల్పడితే.. అదే స్థాయిలో భాజపా బలంగా ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. 

15:02 December 19

11 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు భాజపాలోకి..

తృణమూల్​ కాంగ్రెస్​ మాజీ నేత సువేందు అధికారి భాజపాలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మాజీ ఎంపీ భాజపా గూటికి చేరారు.

14:46 December 19

భాజపా గూటికి సువేందు.. 

బంగాల్​ రాజకీయాలు నాటకీయంగా మారాయి. అందరూ ఊహించినట్లుగానే.. బంగాల్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సువేందు అధికారి భాజపా కండువా కప్పుకున్నారు. అమిత్ షా సమక్షంలో ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

14:04 December 19

రైతు ఇంట్లో షా భోజనం...

బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి అమిత్​ షా.. మిడ్నాపుర్​ జిల్లాలోని బెలిజురి గ్రామంలో ఉన్న ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయన వెంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, కైలాశ్​ విజయ్​వర్గియా కూడా ఉన్నారు.

13:28 December 19

బంగాల్​లో షా విస్త్రత పర్యటన..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బంగాల్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. ఉత్తర కోల్‌కతాలోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించి.. స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరాం బోస్‌ గృహాన్ని సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా సిద్ధేశ్వరి కాళీ ఆలయానికి చేరుకున్న అమిత్‌ షా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

ఆదివారం.. శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి.. బోల్‌ పుర్ రోడ్ షోలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో బెంగాల్‌ వ్యవహారాలపై సమీక్షించేందుకే. షా వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. చేరికలే ప్రధాన లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే.. సువేందు అధికారి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరుతారని తెలుస్తోంది. ఆయనతోపాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అసంతృప్త టీఎంసీ నాయకులు కమలదళంలో చేరతారని రాజకీయ వర్గాలు తెలిపాయి.

11:18 December 19

'ఆ మార్గంలో నడవాలి..'

రెండు రోజుల బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి అమిత్​ షా.. శనివారం కోల్​కతాలోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ స్వామి వివేకానందునికి నివాళులర్పించారు. ఆధునీకతను ఆధ్యాత్మికానికి అనుసంధానించిన వ్యక్తి వివేకానందుడని కొనియాడారు షా. ఆయన చూపించిన మార్గంలో అందరూ నడవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

10:15 December 19

స్వామి వివేకానందకు అమిత్​ షా నివాళి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బంగాల్​లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ఉన్న షా.. కోల్​కతాలోని రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు.

Last Updated : Dec 19, 2020, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details