వాస్తవాధీన రేఖ వెంట చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో అగ్రదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది భారత్. ఫ్రాన్స్, జర్మనీలతో వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. చైనాతో సరిహద్దు వివాదం అంశమై భారత అభిప్రాయాలను రెండు దేశాలు ఆసక్తిగా విన్నాయని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీల్లో జీ-20 కూటమికి 2022లో భారత అధ్యక్షత సహా వివిధ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఆసక్తి చూపాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థిక సహకారం, పెట్టుబడుల తరలింపు, ఎగుమతి- దిగుమతులు, సాంకేతిక రంగంలో భాగస్వామ్యంపై భారత్తో కలిసి పనిచేసేందుకు ఇరుదేశాలు సుముఖత తెలిపాయి.
భద్రతా మండలి కోసం..