తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఛడీ ముబారక్​' రాకతో ముగిసిన అమర్​నాథ్​ యాత్ర

గురువారం 'ఛడీ ముబారక్' రాకతో పవిత్ర అమర్​నాథ్​ యాత్ర ముగిసింది. ఈ ఏట దక్షిణ కశ్మీర్​లోని అమర్​నాథ్​ గుహాలయంలోని మంచు శివలింగాన్ని 3.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

ఛడీ ముబారక్​ రాకలో ముగిసిన అమర్​నాథ్​ యాత్ర

By

Published : Aug 16, 2019, 5:05 AM IST

Updated : Sep 27, 2019, 3:43 AM IST

పవిత్ర అమర్​నాథ్​ యాత్ర గురువారం ముగిసింది. ఈ ఏట దక్షిణ కశ్మీర్​ అమర్​నాథ్​ గుహాలయంలోని మంచు శివలింగాన్ని 3.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా 'ఛడీ ముబారక్​' రాకతో అమర్​నాథ్​ యాత్ర ముగిసింది. 46 రోజులు సాగాల్సిన ఈ యాత్ర జులై 1న మొదలై 31న ప్రతికూల వాతావరణం కారణంగా ఆగింది.

మూడు రోజుల తరువాత...

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడవచ్చనే నిఘా సమాచారం మేరకు అమర్​నాథ్​ యాత్రను ముగించి యాత్రికులు వెళ్లిపోవాలని సైన్యం ఆదేశించింది. ఆ తరువాత యాత్ర పునఃప్రారంభం కాలేదు. ఇటీవలి కాలంలో పవిత్ర అమర్​నాథ్ యాత్రను ఇలా కుదించడం ఇదే మొదటిసారి.

జమ్ము-కశ్మీర్ విభజన

భారత ప్రభుత్వం ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అలాగే రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.

Last Updated : Sep 27, 2019, 3:43 AM IST

ABOUT THE AUTHOR

...view details