మార్చి 2020 కల్లా దేశంలోని అన్ని పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. 'భారత్ నెట్' ప్రాజెక్టు రెండో దశ భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం అందించనున్నట్టు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం అందించారు.
ప్రాజెక్ట్ తొలి దశలో భాగంగా ఇప్పటికే లక్ష పంచాయతీలను బ్రాడ్‌బాండ్ సౌకర్యం కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది.