తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎక్కడ చూసినా ఈవీఎంలలో లోపమే' - అఖిలేశ్

దేశవ్యాప్తంగా ఈవీఎంలలో లోపం ఉందని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ ఆరోపించారు. ఈవీఎంల లోపాలను ఎన్నికల సంఘం నేరపూరిత వైఫల్యంగా అభివర్ణించారు.

అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​

By

Published : Apr 23, 2019, 6:03 PM IST

ఈవీఎంల పనితీరుపై మరోసారి విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో మూడో విడత పోలింగ్ జరుగుతున్న వేళ ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల పనితీరుపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ అనుమానాలు లేవనెత్తారు.

అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​

"దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలలో లోపం ఉంది లేదా భాజపాకు ఓటు పడుతుంది. ఎన్నికల అధికారులకు ఈవీఎంలపై సరైన శిక్షణ లేదని కలెక్టర్​ చెబుతున్నారు. 350కిపైగా ఈవీఎంలను మార్చారు. రూ.50 వేల కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఇది ముమ్మాటికీ ఈసీ వైఫల్యమే.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్​​ చెప్పిన మాటలు మనం నమ్మాలా లేక ఎవరో చెప్పిన మాటలా?"

-అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్

మూడో విడత పోలింగ్​లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. రాంపుర్, బదాయు నియోజకవర్గాల్లో ఈవీఎంల లోపాలపై వస్తున్న నివేదికలను ఈసీ పరిశీలించాలని కోరారు.

"తన కూతురు పోటీ చేస్తున్నందున రాష్ట్ర మంత్రి బదాయులో పోలింగ్​ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలిసింది. అధికారులు ఈవీఎంలపై యంత్రాంగానికి సరైన శిక్షణ లేదని చెబుతున్నారు. ఇదేనా ప్రభుత్వం చెబుతున్న డిజిటల్​ ఇండియా? "
-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details