తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన ఆవిర్భావ దినోత్సవానికి ఫడణవీస్​ - uddav takre

శివసేన పార్టీ 53వ ఆవిర్భావ దినోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన తొలి శివసేన పార్టీయేతర ముఖ్యమంత్రి ఫడణవీస్ ​కావటం విశేషం.

శివసేన ఆవిర్భావ దినోత్సవానికి ఫడణవీస్​

By

Published : Jun 20, 2019, 6:47 AM IST

శివసేన ఆవిర్భావ దినోత్సవానికి ఫడణవీస్​

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 53వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ హాజరయ్యారు. తొలిసారి శివసేనేతర పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి ఫడణవీస్​ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

శివసేన వ్యవస్థాపక కార్యక్రమానికి హాజరుకావాలని ఫడణవీస్​కు ఠాక్రే ప్రత్యేక ఆహ్వానం పంపారు.

" కాషాయ జెండా కోసం ఇరు పార్టీలు పనిచేస్తున్న నేపథ్యంలో సొంత ఇంటిలోనే ఉన్నట్లు ఉంది. ఉద్ధవ్​ ఠాక్రే నాకు పెద్ద అన్నయ్య. గతంలో భాజపా, సేనా మధ్య పలు తేడాలు ఉండేవి. కానీ చాలా ఏళ్లుగా కూటమిగా కలిసి ఉన్నందున పార్టీల మధ్య ఉన్న తేడాలు తొలగిపోయాయి. ప్రస్తుతం పులి, సింహం మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి."

- దేవేంద్ర ఫడణవీస్​, మహరాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చూడండి:'న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి'

ABOUT THE AUTHOR

...view details