తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరో దశలోనూ బంగాల్​ హింస్మాతకం - కాల్పులు

సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్​ ముందు రోజు బంగాల్​లో మరోసారి హింస చెలరేగింది. జాడ్​గ్రామ్​లో ఓ భాజపా కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ప్రాంతంలో​ ఆరో విడతలోనే పోలింగ్​ జరుగుతోంది. తూర్పు మేధినీపుర్​లో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలపై కాల్పులు జరగడం కలకలం రేపింది.

ఆరో దశలోనూ బంగాల్​ హింస్మాతకం

By

Published : May 12, 2019, 10:34 AM IST

Updated : May 12, 2019, 12:43 PM IST

ఆరో దశలోనూ బంగాల్​ హింస్మాతకం

2019 సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్​ ముందు రోజు బంగాల్​ మరోసారి భగ్గుమంది. శనివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు భాజపా కార్యకర్తలపై దాడి జరిగింది. ఇందులో ఓ కార్యకర్త మృతి చెందాడు.

జాడ్​గ్రామ్​లోని గోపిబళ్లాపుర్​ ప్రాంతంలో రమణ్​సింగ్​ అనే భాజపా కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నేడు ఈ ప్రాంతంలో పోలింగ్​ జరుగుతోంది.

తూర్పు మేధినీపుర్​లోని భగవాన్​పుర్​ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో అనంత గుచైత్, రంజిత్​ మైతి అనే ఇద్దరు భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బంగాల్​లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలింగ్​ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆరో విడత పోలింగ్​ కోసం 770 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు.

Last Updated : May 12, 2019, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details