కరోనా మహమ్మారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు బెంబేలెత్తుతున్నాయి. ఇరుకు ఇళ్లల్లో ఉంటూ.. ఎటువైపు నుంచి వైరస్ వచ్చిపడుతుందోనని బిక్కుబిక్కమంటూ జీవిస్తున్నారు నగరవాసులు. అనేక చోట్ల భౌతిక దూరం పాటించడం చాలా కష్టంగా మారింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన బృందం.. తరతరాలుగా భౌతిక దూరాన్ని సంప్రదాయంగా మార్చుకుని జీవనం సాగిస్తోంది.
సంప్రదాయమే ముఖ్యం...
ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత సున్నితమైన గిరిజనుల బృందాల్లో అభుజ్మారియా ఒకటి. ఆసుపత్రులకు అనేక కిలోమీటర్ల దూరంలో..దరిద్రానికి అతి సమీపంలో జీవనం సాగిస్తున్నారు ఈ గిరిజనలు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి వీరిని తాకితే.. ఆ మొత్తం గిరిజన జాతే ప్రమాదంలో పడే అవకాశముంది. కానీ ఎన్నో ఏళ్లుగా వీరు పాటించే ఓ సంప్రదాయం.. ఇప్పుడు వీరిని కాపాడుతోంది. దేశాన్ని వీరివైపు చూసేలా చేసింది ఆ సంప్రదాయం.