తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హాథ్రస్​ నిందితులు అమాయకులు.. ఇది పరువు హత్యే' - హాథ్రస్​ కేసు న్యాయవాది

'హాథ్రస్​' నిందితుడి న్యాయవాది ఏపీ సింగ్​.. అతడి కుటుంబసభ్యులను శనివారం కలిశారు. ఘటనకు సంబంధించిన కీలక వివరాలు, ఆధారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే హాథ్రస్​ కేసులో ఎస్​సీ/ఎస్​టీ చట్టాన్ని దుర్వినియోగం చేశారని.. నిందితుడికి న్యాయం జరిగేంతవరకు పోరాడతానని తేల్చిచెప్పారు సింగ్​.

Advocate AP Singh meets family of Hathras accused
'హాథ్రస్​' ఘటనలో పరువు హత్య కోణం ఉంది'

By

Published : Oct 10, 2020, 6:54 PM IST

హాథ్రస్​ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా.. ఈ నలుగురిలో ఓ నిందితుడి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్​తో పాటు క్షత్రియ మహాసభ సభ్యుడు మన్వేంద్ర సింగ్​.. హాథ్రస్​కు వెళ్లారు.

నిందితుడి కుటుంబసభ్యులను కలిసిన ఏపీ సింగ్​.. ఘటనకు సంబంధించిన కీలక వివరాలు, ఆధారాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు ఏపీ సింగ్​. హాథ్రస్​ కేసులో ఎస్​సీ/ఎస్​టీ చట్టాన్ని దుర్వినియోగించారని, విషయాన్ని రాజకీయం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఘటనను కేవలం నేరంగా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:-'హాథ్రస్​' ఘర్షణల కోసం విదేశాల నుంచి రూ.100 కోట్లు!

పరువు హత్య కోణం!

హాథ్రస్​ ఘటనలో ఎలాంటి అత్యాచారం, సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పిన ఏపీ సింగ్​.. నిందితుడికి న్యాయం జరిగేంతవరకు పోరాడతామని స్పష్టం చేశారు.

దీనిని పరువు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు న్యాయవాది. నిందితుల్లో ఒకడైన సందీప్​ సింగ్​ రాసిన లేఖ ఇందుకు కారణమన్నారు. తామందరం నిర్దోషులమని.. నిజానికి బాధితురాలి సోదరుడే నిందితుడని.. హాథ్రస్​ ఎస్​పీకి సందీప్​ సింగ్​ లేఖ రాసినట్టు పేర్కొన్నారు.

తనతో సంబంధం ఉండటం వల్లే.. బాధితురాలి సోదరుడు ఆమెపై దాడి చేసి హత్య చేశాడని.. లేఖలో సందీప్​ ఆరోపించినట్టు ఏపీసింగ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:-'హాథ్రస్‌ కేసులో సాక్షులకు రక్షణ ఎలా?'

బాధితురాలి తల్లితో పాటు పలువురు గ్రామస్థులు.. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నట్టు న్యాయవాది ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టు స్పష్టం చేశారు.

అయితే బాధితురాలు తన వాగ్మూలంలో 'సందీప్'​ పేరు చెప్పినట్టు గుర్తుచేసిన ఏపీ సింగ్​.. అందులో కచ్చితత్వం లేదని పేర్కొన్నారు. ఆమె సోదరుడి పేరు కూడా సందీప్​ కావడమే ఇందుకు కారణమన్నారు.

మరోవైపు.. నిందితులు అమాయకులని రుజువుచేయడం కోసం తాను అన్ని విధాలుగా శ్రమిస్తానని మన్వేంద్ర సింగ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:-'బాధితురాలిపై వదంతులు మాని.. న్యాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details