తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"అడ్వాణీకి టికెట్​ ఇవ్వకపోవడం అవమానం" - ADVANI

అగ్ర​ నేత ఎల్​ కే అడ్వాణీని భారతీయ జనతా పార్టీకి మూలస్తంభంగా, మార్గదర్శిగా అభివర్ణించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం ముమ్మాటికీ ఆయనను అవమానించడమేనని దీదీ అభిప్రాయపడ్డారు.

అడ్వాణీకి టికెట్​ ఇవ్వకపోవడం అవమానం: మమతా బెనర్జీ

By

Published : Mar 27, 2019, 6:49 AM IST

అడ్వాణీకి టికెట్​ ఇవ్వకపోవడం అవమానం: మమతా బెనర్జీ
తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్​కే అడ్వాణీ లాంటి నేతను పక్కన పెట్టడాన్ని దీదీ ఆక్షేపించారు.

వాజ్​పేయిూ, అడ్వాణీ ఇద్దరూ భాజపాలో అగ్రనాయకులని దీదీ పేర్కొన్నారు. అడ్వాణీ లాంటి నేతను భాజపా పక్కన పెట్టడం బాధాకరమన్నారు. సీనియర్లకు భాజపా విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు.

"ఇన్నేళ్లూ మనం చూశాం..అడ్వాణీ భాజపాకు అసలైన మార్గదర్శకులు. కొత్త తరం నాయకులు వచ్చారు.. పాత రోజులను మర్చిపోయారు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది ఆయనకు జరిగిన అవమానం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వారు దీన్ని అంగీకరించకపోవచ్చు" - మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

యువతకు, మహిళలకు, అన్ని వర్గాలకు సీట్లు కేటాయించాలి. కానీ సీనియర్​ నాయకులను పక్కన పెట్టకూడదని దీదీ హితవు పలికారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్​డీ దేవగౌడ లాంటి సీనియర్​ నాయకులు పోటీ చేస్తున్నట్లు మమత ప్రస్తావించారు.

అడ్వాణీ పోటీ చేసే గాంధీనగర్​ స్థానాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్​ షాకు కేటాయిస్తూ మార్చి 21న పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details