భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కే. అడ్వాణీ విషజ్వరంతో బాధపడుతున్నారు. 5 రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన... గురువారం తన నివాసంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం లేదు.
అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం - స్వాతంత్య్ర దినోత్సవం
భాజపా సీనియర్ నేత ఎల్. కే అడ్వాణీ అస్వస్థతకు గురయ్యారు. ఐదు రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న కారణంగా ఈ సారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం లేదని ఆయన కార్యాలయం వెల్లడించింది.
అడ్వాణీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ తన నివాసంలో దశాబ్దాలుగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ వస్తున్నారు. 91 ఏళ్ల అడ్వాణీ వైరల్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఈ సారి జాతీయ జెండా ఎగరవేయడం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Last Updated : Sep 27, 2019, 1:04 AM IST