తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాణాధార వ్యవస్థపైనే జైట్లీ- ప్రముఖుల సందర్శన - ఆరోగ్య పరిస్థతి విషమం

అరుణ్​జైట్లీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆదివారం రాత్రి నుంచి ఆయన ప్రాణాధార వ్యవస్థపైనే చికిత్స పొందుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికి రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

ప్రాణాధార వ్యవస్థపైనే జైట్లీ- ప్రముఖుల సందర్శన

By

Published : Aug 19, 2019, 4:21 PM IST

Updated : Sep 27, 2019, 12:59 PM IST

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ ఇంకా ప్రాణాధార వ్యవస్థపైనే చికిత్స పొందుతున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికి ప్రముఖులు ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ సోమవారం ఎయిమ్స్​ను సందర్శించారు. జైట్లీ ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఆర్థికమంత్రి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.

కేంద్ర మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్​ కూడా జైట్లీ కోసం ఎయిమ్స్​ వెళ్లారు.

శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న అరుణ్​జైట్లీని కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఎయిమ్స్​లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి 10వ తేదీ నుంచి ఎయిమ్స్...​ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇదీ చూడండి:- యమున ఉగ్రరూపం.. దిల్లీకి ప్రమాద హెచ్చరిక

Last Updated : Sep 27, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details