నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఐదుగురు మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులోని పులికేశినగర్లో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి - dead
కర్ణాటకలోని బెంగళూరు పులికేశి నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు.
కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
Last Updated : Jul 10, 2019, 10:59 AM IST