తమిళనాడు రామనంతపురం మాజీ ఎంపీ, సినీ నటుడు జేకే రితీష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రితీష్ మరణ వార్త ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రామనంతపురంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హూటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రితీష్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సామాజిక మాధ్యమాలు వేదికగా రితీష్కు అభిమానులు నివాళుర్పించారు. తమ అభిమాన నాయకుడిని చివరి సారి చూసేందుకు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.