తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాలో చేరిన నటి, మాజీ ఎంపీ జయప్రద - లోక్​సభ

ప్రముఖ సినీ నటి, సమాజ్​వాదీ పార్టీ మాజీ నేత అమర్​సింగ్​ అనుయాయురాలు జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్​ రామ్​పుర్​ లోక్​సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు.

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద

By

Published : Mar 26, 2019, 3:42 PM IST

Updated : Mar 26, 2019, 4:02 PM IST

కమలం పార్టీలోకి జయప్రద
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్​లోని రామ్​పుర్ లోక్​సభ స్థానం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారామె.

సమాజ్​వాదీ (ఎస్పీ) పార్టీ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ అమర్​సింగ్ అనుయాయురాలుగా జయప్రద గుర్తింపు పొందారు. ఆమె గతంలో రామ్​పుర లోక్​సభ స్థానం నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

రామ్​పుర్ భాజపా టికెట్​ జయప్రదకు ఖరారైతే, సమాజ్​వాదీ పార్టీ సీనియర్​ నాయకుడు ఆజమ్​ఖాన్​ను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదీ చూడండి :పోటీకే కాదు ప్రచారానికీ అగ్రనేతలు దూరం

Last Updated : Mar 26, 2019, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details