తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్టీఐ' చట్ట సవరణ ఆమోదించొద్దని రాష్ట్రపతికి వినతి - రాష్ట్రపతి

సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు-2019ను ఆమోదించొద్దని రాష్ట్రపతిని కోరారు మానవ హక్కుల కార్యకర్తలు. వినతి పత్రం అందించడానికి రాష్ట్రపతి భవన్​కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స.హ. చట్టం బిల్లును తిరిగి పార్లమెంట్​కు పంపాలని కోరారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రమేశ్​ చెన్నితాల.

'ఆర్టీఐ' బిల్లును ఆమోదించ వద్దు: రాష్ట్రపతికి వినతి

By

Published : Aug 1, 2019, 6:16 PM IST

సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా బిల్లును ఆమోదించొద్దని రాష్ట్రపతిని కోరారు పీపుల్స్​ రైట్​ టూ ఇన్ఫర్మేషన్​ (ఎన్​సీపీఆర్​ఐ) కార్యకర్తలు. వినతి పత్రం అందించేందుకు రాష్ట్రపతి భవన్​కు వెళ్లే ప్రయత్నం చేశారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసేందుకు గేట్​ నంబర్​-38 వద్ద సమావేశమయ్యారు ఎన్​సీపీఆర్​ఐ కార్యకర్తలు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. మందిర్​ మార్గ్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇటీవలే స.హ. చట్టం సవరణ బిల్లు-2019కు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది.

ఇది ప్రజాస్వామ్యమేనా?

తమను అరెస్ట్​ చేయటాన్ని తీవ్రంగా తప్పబట్టారు ఎన్​సీపీఆర్​ఐ కార్యకర్తలు. మన దేశంలో శాంతియుతంగా రాష్ట్రపతికి పిటిషన్​ అందించే హక్కు లేదా? ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు. సమాచార కమిషన్​ స్వతంత్రతను హరిస్తున్నారని ఆరోపించారు.

తిరిగి పార్లమెంట్​కు పంపండి: కాంగ్రెస్​

ఆర్టీఐ చట్ట సవరణ బిల్లులోని అభ్యంతరకర నియమాలను పరిశీలించేందుకు బిల్లును తిరిగి పార్లమెంట్​కు పంపించాలని రాష్ట్రపతిని కోరారు కాంగ్రెస్ సీనియర్​ నాయకుడు రమేశ్​ చెన్నితాల. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 111లోని విచక్షణ అధికారాలతో బిల్లును తిప్పిపంపాలని కోరారు. ఆర్టీఐ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'అనర్హులకు అనుమతిస్తే బూటకపు వైద్యమే'

ABOUT THE AUTHOR

...view details