మధ్యప్రదేశ్ ఛింద్వాడా జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలిక కడుపులోంచి సుమారు రెండున్నర కిలోల కేశాలు బయటపడ్డాయి.
బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలిక ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో ఏముందో చూసి ఖంగు తిన్నారు. శస్త్ర చికిత్స చేసి దాదాపు రెండున్న కిలోల బరువున్న తల వెంట్రుకలను బయటకు తీశారు.
బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు ఆ అలవాటు వల్లే..
బాలికకు కొన్నేళ్లుగా కేశాలు తినే వింత అలవాటు ఉంది. రోజూ తినడం వల్ల అవి పేగుల్లో పేరుకుపోయి, ఆమె జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెట్టాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి