పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన వాయుసేన వింగ్ కమాండర్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఆమెతో పాటుగా ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా ఉన్నారు. వారితో నిర్బంధంలో ఉన్నప్పటి పరిస్థితులను అభినందన్ వివరించినట్లు ఆంగ్ల మీడియా సంస్థ తెలిపింది.
నిర్బంధంలో ఉన్న రెండున్నర రోజుల్లో శారీరక హింసకు గురికాలేదని స్పష్టం చేశారు అభినందన్. మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.