దిల్లీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. 'అచ్చే బీతే పాంచ్ సాల్-లగే రహో కేజ్రీవాల్' (గత ఐదేళ్ల పాలన బాగుంది-మళ్లీ కేజ్రీవాల్‌నే గెలిపించండి) అనే నినాదంతో ప్రచారం ప్రారంభించింది.
దిల్లీ ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించే ఈ నినాదాన్ని ఎన్నికల ప్రచారంగా ఎంపిక చేశామన్నారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.