తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కాంగ్రెస్ - ఆప్​ పొత్తు కుదిరేనా.?

దిల్లీలో కాంగ్రెస్ - ఆప్​ మధ్య పొత్తుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. సీట్ల పంపకాలపై ఇరు వర్గాలు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మూడు సీట్లు కావాలంటుంటే.. ఆప్​ మాత్రం రెండే కేటాయిస్తామంటోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏడుగురు లోక్​సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపింది దిల్లీ కాంగ్రెస్.

కాంగ్రెస్ - ఆప్​ పొత్తు కుదిరేనా?

By

Published : Apr 20, 2019, 9:33 AM IST

దిల్లీలో కాంగ్రెస్ - ఆప్​ పొత్తు కుదిరేనా?

దిల్లీలో లోక్​సభ ఎన్నికల గడువు ముంచుకొస్తున్నా... కాంగ్రెస్​ - ఆమ్​ఆద్మీ​ మధ్య పొత్తు కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు విభిన్న వాదనలతో ఉన్నాయి. మూడు సీట్లలో పోటీ చేస్తామనికాంగ్రెస్ భీష్మించగా.. రెండు సీట్లు మాత్రమే ఇస్తామని ఆప్​ అంటోంది.

కాంగ్రెస్​ ఈ ఒప్పందానికి అంగీకరిస్తే హరియాణాలోని ఛండీగఢ్ ​నుంచి పోటీ చేయబోమని హామీ ఇచ్చింది ఆప్. అయితే సమయం మించిపోతుండటం వల్ల ముందు జాగ్రత్తగా ఏడుగురు అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపారు దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్.

దిల్లీకే పరిమితం

ఆప్​తో పొత్తు దిల్లీకే పరిమితం చేయాలని కాంగ్రెస్​ యోచిస్తోంది. హరియాణా, ఛండీగఢ్​ల్లోనూ హస్తంతో పొత్తుకు ఆప్ సుముఖంగా ఉంది. పొత్తు కుదిరితే తూర్పు దిల్లీ, చాందినీ చౌక్ స్థానాలను కాంగ్రెస్ కోరే అవకాశం ఉంది. చివరి అవకాశంగా ఈ సీట్లలో దాఖలు చేయాల్సిన నామినేషన్​ను వాయిదా వేసింది ఆప్. మోదీ-షా ద్వయం నుంచి దేశాన్ని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

"పొత్తు కోసం కాంగ్రెస్​కు చివరి అవకాశం ఇవ్వడంలో భాగంగా రెండు సీట్లకు నామపత్రాల దాఖలును శనివారం నుంచి సోమవారానికి వాయిదా వేస్తున్నాం."

-గోపాల్ రాయ్, ఆప్​నేత

కుదరపోతే సోమవారం ముహూర్తం

దక్షిణ దిల్లీ, ఈశాన్య దిల్లీ, నూతన దిల్లీ స్థానాలకు ఆప్ తరఫున సోమవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్​తో పొత్తు కుదరకపోతే తూర్పు దిల్లీ, చాందినీ చౌక్ స్థానాలకూ ఆ రోజే నామినేషన్లు వేస్తారు​.

దిల్లీలో మొత్తం ఏడు లోక్​సభ స్థానాలు ఉన్నాయి.సార్వత్రిక ఎన్నికల ఆరోదశలో భాగంగా మే 12న పోలింగ్​ జరుగుతుంది.

రాహుల్​కు అభ్యర్థుల పేర్లు

దిల్లీ లోక్​సభ నియోజకవర్గాలకు నామ పత్రాల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఏడు నియోజకవర్గాల కోసం అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి పంపామనిఏఐసీసీ ఇన్​ఛార్జీ పీసీ చాకో తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ బయోపిక్​ విడుదల కష్టమేనా.!

ABOUT THE AUTHOR

...view details