దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. రాంలీలా మైదానం వేదికగా ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకార మహోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు - రాంలీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాంలీలా మైదానంలో ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
రాంలీలా మైదానంలో అన్నా హజారే నేతృత్వంలో చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. దిల్లీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఇక్కడి నుంచే ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేజ్రీవాల్‌కు ఎంతో ప్రత్యేకమైన ఈ వేదికనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికైన ఆప్ శాసనసభ్యులు... పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్ అనిల్ బైజాల్‌కు అందిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉంది.