తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత్రంతా పులుల పక్కనే గడిపాడు.. అతడికి ఏమైంది? - maharastra latest nes

పులిని దూరంగా చూస్తేనే గుండెళ్లో రైళ్లు పరిగెడుతాయి. అలాంటిది మహారాష్ట్రలో ఓ యువకుడు ఏకంగా రాత్రంతా పులుల పక్కనే గడిపాడు. మరి ఆ పులులు తననేం చేయలేదా అనుకుంటున్నారా? అయితే, ఈ కథనం పూర్తిగా చదివేయండి!

A youth slept overnight inside the tiger's enclosure in famous Sidhartha zoo at aurangabad, maharastra
రాత్రంతా పులుల పక్కనే గడిపాడు.. అతడికి ఏమైంది?

By

Published : Jun 5, 2020, 5:14 PM IST

మహారాష్ట్ర అనురాగ్​బాద్​లోని ఓ జంతు ప్రదర్శనశాలలో.. రాత్రంతా పులుల పక్కనే గడిపాడో యువకుడు. పీసాదేవీ సమీపంలోని శ్రీకృష్ణ నగర్​కు చెందిన రవీంద్ర ససానే.. మానసిక స్థితి బాలేదు. అర్థరాత్రి జూ వెనకభాగం నుంచి గోడ దూకాడు. తాను పడిన ప్రదేశం పులులు సంచరించేందకు ప్రత్యేకంగా కేటాయించినది. అది తెలియని రవీంద్ర.. రాత్రంతా పులులకు అతి సమీపంగా గడిపాడు. అయితే, అదృష్టం బాగుండి రాత్రి క్రూర మృగాలను బోనులో బంధిచారు కాబట్టి బతికి బయటపడ్డాడు.

సిద్ధార్థ జూ ఇదే..

ఉదయం జూ తెరిచిన సిబ్బంది పులుల ప్రదేశంలో ఆ యువకుడిని చూసి ఖంగుతిన్నారు. వెంటనే జూ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు రవీంద్రను పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు

ABOUT THE AUTHOR

...view details