అందరూ ఆ మహిళ చనిపోయిందనుకున్నారు. కుటుంబం, బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆమె కళ్లు తెరించింది. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన మాలు యల్లప్ప చౌగులే(55) అనే మహిళ కొన్ని నెలలుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించడం వల్ల ఈ నెల 7న ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వెంటిలేటర్లపై చికిత్స అందించిన వైద్యులు.. చేతులెత్తేశారు. ఆమె బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లిపొమన్నారు.