తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇన్​స్పెక్టర్​ను కాల్చి చంపి ఎస్​ఐ ఆత్మహత్య - dead news

shoot
షూట్

By

Published : Jul 25, 2020, 8:58 AM IST

Updated : Jul 25, 2020, 10:46 AM IST

09:06 July 25

దిల్లీ లోధి ప్రాంతంలోని సీఆర్​పీఎఫ్​ 122వ బెటాలియన్​లో కాల్పులు కలకలం రేపాయి. ఇన్​స్పెక్టర్​ను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​.  

లోధి ఎస్టేట్​లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు సీఆర్​పీఎఫ్​ ఉన్నతాధికారులు తెలిపారు. సబ్​ ఇన్​స్పెక్టర్​ కర్నేల్​ సింగ్​, ఇన్​స్పెక్టర్​ దశరథ్​​ సింగ్ మధ్య వాగ్వాదం జరిగిందని.. మాటామాటా పెరిగి తీవ్ర రూపం దాల్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కర్నేల్​ సింగ్​ ఇన్​స్పెక్టర్​పై కాల్పులు జరిపినట్లు చెప్పారు. తూటా గాయాలతో దశరథ్​​ సింగ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. కొద్ది సమయానికే సబ్​ ఇన్స్​పెక్టర్​ కర్నేల్​ సింగ్​ కూడా తుపాకీతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.  

ఘటనపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ​

08:55 July 25

తనకు తానే కాల్చుకున్న సీఆర్​పీఎఫ్ సబ్​ ఇన్​స్పెక్టర్

సీఆర్​పీఎఫ్ 122వ బెటాలియన్​కు చెందిన సబ్​ ఇన్​స్టెక్టర్​ కర్నిల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. సీఆర్​పీఎఫ్ ఇన్​స్పెక్టర్​ దశరథ్ సింగ్​ను గతరాత్రి కాల్చిన ఈయన.. అనంతరం తనకు తానే కాల్చుకుని చనిపోయారు. ఈ విషయమై దిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Last Updated : Jul 25, 2020, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details