తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం - Srinivas Gupta

భార్యపై ప్రేమతో విగ్రహాన్ని తయారు చేయించాడో భర్త. చనిపోయిన ఆమె రూపాన్ని ఈ ప్రతిమలో చూసుకుంటూ మురిసిపోతున్నారు కుటుంబ సభ్యులు. గృహ ప్రవేశం సందర్భంగా.. భార్యలేని లోటు తెలియకూడదనే ఇలా ఆమె ప్రతిరూపాన్ని ఏర్పాటు చేయించానంటున్నాడు కర్ణాటకకు చెందిన శ్రీనివాస్​ గుప్తా.

A MAN HAS MAKING WIFE WAX STATUE FOR THE EVENT OF HOUSE OPENING
సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

By

Published : Aug 10, 2020, 11:15 PM IST

Updated : Aug 11, 2020, 2:50 PM IST

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

బతికి ఉండగానే భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న భర్తలున్న రోజులివి. అలాంటిది కుటుంబాన్ని విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారో భర్త. ఇది కర్ణాకటలో జరిగింది. రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ గుప్తా తన భార్యకు విగ్రహం చేయించారు. ఈ విగ్రహం వెనుక కథేంటంటే...

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

శ్రీనివాస్‌ గుప్తా భార్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల శ్రీనివాస్‌ గుప్తా గృహ ప్రవేశం చేశారు. ఈ వేడుకలో తన భార్య లేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహం చేయించి ఇంట్లో ఉంచారు. ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు.

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం
సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే.. నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ విగ్రహం గురించి ఎవరైనా చెప్తే గానీ తెలిసేలా లేదు. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో కదా.!

సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

ఇదీ చదవండి:భార్యకు కరోనా సోకిందని భర్త పరార్

Last Updated : Aug 11, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details