తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉల్లిపాయలు లేవని.. కాంగ్రెస్​ నేత వేలు కొరికిన యువకుడు! - ఉత్తరాఖండ్​ నైనితాల్​ జిల్లా హల్​ద్వాని

ఉల్లి ధరలు సామాన్యుడిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్​ నైనితాల్​ జిల్లా హల్​ద్వానిలో చోటు చేసుకుంది. తాను కొనేందుకు వచ్చే సరికి వ్యాపారుడి వద్ద ఉల్లిపాయలు లేవని విక్రయదారుడి వేలు కొరికేశాడు ఓ యువకుడు.

a man cut down the finger of congress worker by his teeth
ఉల్లిపాయలు లేవని.. వేలు కొరికేసిన యువకుడు!

By

Published : Dec 6, 2019, 6:46 PM IST

Updated : Dec 6, 2019, 9:09 PM IST

ఉల్లిపాయలు లేవని.. కాంగ్రెస్​ నేత వేలు కొరికిన యువకుడు!

ఉల్లి ధర ఘాటు దేశవ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే ఉల్లిపాయలు ఇచ్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్​ నైనితాల్​ జిల్లాలో కాంగ్రెస్​ సేవాదళ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓ యువకుడు హల్​చల్​ సృష్టించాడు. ఉల్లిపాయలు విక్రయిస్తున్న సేవాదళ్​ సభ్యుడి వేలును కొరికేశాడు.

ఇదీ జరిగింది..

ఉల్లి ధరలు పెరగటం వల్ల జిల్లాలోని హల్ద్వానిలో కాంగ్రెస్​ సేవాదళ్​ ఆధ్వర్యంలో ఉల్లిపాయల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఓ యువకుడు స్టాల్​ వద్దకు వచ్చాడు. కానీ.. అప్పటికే ఉల్లిపాయలు అయిపోయాయని విక్రయదారులు చేప్పారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తి చేసిన ఆ యువకుడు అక్కడ హల్​చల్​ సృష్టించాడు. స్టాల్​లో ఉన్న కాంగ్రెస్​ సేవాదళ్​ సభ్యుడి వేలును కొరికేశాడు. వేలు తెగి కిందపడిపోయింది.

ఆ యువకుడిని సేవదళ్​ సభ్యులు పట్టుకుని చితకబాదారు. అతను భాజపాకు చెందిన వ్యక్తిగా ఆరోపించారు.

ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల్ని ఎన్​కౌంటర్​ చేయంది అందుకే!

Last Updated : Dec 6, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details