సుకుమార్ హజ్రా తాగి ఇంటికొచ్చాడు. అతని భార్య యమునా హజ్రాతో గొడవకు దిగాడు. నానా రభసా చేసి ఆమెను గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. ఇదంతా గమనిస్తున్న వారి కుమారుడు విశ్వనాథ్ ఆవేశంతో ఊగిపోయాడు. తల్లిని కాపాడేందుకు తండ్రితో పోరాడాడు. దగ్గర్లో ఉన్న పదునైన ఆయధం తీసుకుని కన్నతండ్రినే పొడిచేశాడు. నెత్తురు మడుగుల్లో సుకుమార్ శవంగా మిగిలాడు. మద్యం మత్తులో తండ్రి చేసిన తప్పుకు శాశ్వత శిక్ష విధించాడు కొడుకు.
'అమ్మను కొట్టాడని నాన్నని చంపేశాడు!'
ఓ కొడుక్కు.. తల్లిపై ప్రేమ తండ్రిని శత్రువును చేసింది. తల్లిని కొట్టి గొంతు నులిమినందుకు తండ్రిని నిర్ధాక్షిణ్యంగా చంపేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
'అమ్మను కొట్టాడని నాన్నని చంపేశాడు!'
పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న విశ్వనాథ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: 515 గణేశన్... సేవా రథానికి సూపర్ డ్రైవర్
Last Updated : Sep 27, 2019, 10:40 AM IST