తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాగ్వార్​ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!

హరియాణా యమునానగర్​లో ఖరీదైన కార్ల మోజులో ఓ యువకుడు చేసిన పని అందరినీ నివ్వెరపరిచింది. పెద్ద కారు కావాలంటూ రూ.60 లక్షలు పెట్టి కొన్న బీఎండబ్ల్యూ కారును కాలువలో పడేశాడు. ఐదు గంటలు శ్రమించి కారును బయటకు తీశారు పోలీసులు.

జాగ్వార్​ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!

By

Published : Aug 10, 2019, 11:47 AM IST

Updated : Aug 10, 2019, 3:58 PM IST

జాగ్వార్​ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!

పిల్లలను గారాబం చేయడం మంచిదే కానీ హద్దుమీరితే ప్రమాదమే. హరియాణాలో ఓ బడాబాబు కుమారుడు చేసిన నిర్వాకమే ఇందుకు ఉదాహరణ.

జాగ్వార్​ కావాలి..

హరియాణా ముకారోమ్​పుర్​కు చెందిన ఓ యువకుడు తండ్రితో ​​ కారు కావాలని గొడవ పడ్డాడు. కారంటే ఏ ఆడుకునే కారో కాదు.. అత్యంత విలువైన జాగ్వార్ కారు అడిగాడు. కానీ, వాళ్ల నాన్న ఆ కారు కొనివ్వలేదు.

చిర్రెత్తిన యువకుడు.. 'HR O2 7777' నంబరు గల తన బీఎండబ్ల్యూ కారు తీసుకుని యమునా కాలువ దగ్గరికొచ్చాడు. ఫోన్​లో మాట్లాడుతూ... "నేను ఇంతకంటే పెద్ద కారు కొంటాను.. కోటిన్నర రూపాయలు ఖరీదైన కారు కొంటాను" అని సవాలు చేశాడు. ప్రతీకారంగా తనంతటతానే బీఎండబ్ల్యూను కాలువలోకి నెట్టాడు.

"అక్కడ తనంతటతానే కారును కాలువ దగ్గరకు తీసుకొచ్చాడు. ఇంతకంటే పెద్ద కారు కొంటానని ఎవరితోనో గొడవపడుతున్నాడు. అంతలోనే ప్రజలు గుమిగూడారు. అందరూ ఆశ్చర్యపోయారు. తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. తనంతటతానే వెనుక నుంచి నెట్టాడు. ఇంకో కారు కొంటాను అంటూ.. నీటిలోకి వదిలాడు. అతను ముకరోమ్​పుర్​కు చెందిన యువకుడే. అతను ఇదివరకు చాలా సార్లు ఇలాగే చేశాడు."
-రమేశ్​, ప్రత్యక్ష సాక్షి

అలసిన ఖాకీలు

కాలువలో కొంత దూరం ప్రవహించి దాదుపుర్​ దగ్గరికొచ్చి చిక్కుకుంది బీఎండబ్ల్యూ. ఓ వ్యక్తి గమనించి పోలిసులకు సమాచారం ఇచ్చాడు. ఉదయం తొమ్మిదింటికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గుమిగూడిన వందలాది మంది సాయంతో కారును లాగుతుండగా తాడు తెగిపోయింది. మరో తాడును కట్టి మళ్లీ లాగారు. నీటి ప్రవాహం పెరిగేసరికి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​​డీఆర్​ఎఫ్)​ రంగంలోకి దిగింది.

దాదాపు ఐదు గంటలు శ్రమించి కారును బయటకు తీశారు. ఆ సమయంలో కారు భాగాలు కొన్ని చెడిపోయాయి. కారులో మనుషులెవరూ లేరని పోలీసులు తెలిపారు. కారు వదిలివెళ్లిన యువకుడిని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:అల్లా మహిమ! ఈ 'బకరా' ఎంతో అమూల్యం​

Last Updated : Aug 10, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details