గుజరాత్లో కూలిన భవనం- నలుగురు మృతి - భయాందోళనలు
గుజరాత్లో దారుణం జరిగింది. నడియాడ్ ప్రగతినగర్‌లోని ఓ మూడంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
గుజరాత్లో కూలిన భవనం
తీర రాష్ట్రం గుజరాత్ ఖేడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలా మందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కూలిన భవనం.. పురాతనమైనదిగా తెలుస్తోంది.
Last Updated : Aug 10, 2019, 7:35 AM IST