ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక సమరం ఆదివారం ముగిసింది. పశ్చిమ బంగాల్లో అన్ని దశల్లోనూ ఘర్షణలు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు నడుమ సాగిన పోలింగ్ ఆదివారం జరిగిన ఏడో దశతో ముగిసింది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
61 కోట్ల మంది
దేశంలో 90.99కోట్ల మంది ఓటర్లకు గాను ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 61కోట్ల మంది ఓటు వేశారని అంచనా. ఆదివారం జరిగిన ఏడో విడతలో 64శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్.. భాజపానే మళ్లీ అధికారం చేపడుతుందని తేల్చేశాయి.
ఏడు దశల్లో మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 8వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్ మాత్రం వాయిదా పడింది.