తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. మరో ఏడుగురు మృతి - floods latest news

అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకుని మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది.

Assam
అసోంలో వరదల ఉద్ధృతి కొనసాగుతోంది

By

Published : Jul 1, 2020, 10:06 PM IST

అసోంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది.

భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడి.. బార్​పేట జిల్లాలో ముగ్గురు, ధుబ్రి, నాగావూన్​, నల్బారీ, కచార్​ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

వరదలో బిడ్డను తీసుకెళ్తోన్న తల్లి

రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో మొత్తం 15లక్షల మంది తీవ్రంగా ప్రభావితమైనట్లు అసోం విపత్తు నిర్వాహణ అథారిటీ (ఏఎస్​డీఎంఏ) తెలిపింది. ఇప్పటి వరకు 27వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు స్పష్టం చేసింది.

చెరువును తలపిస్తోన్న ఇళ్ల పరిసరాలు

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానిక అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు.

వరద నీటితో నిండిన ప్రాంతం
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది

ఇదీ చూడండి: 'కరోనిల్​' అమ్మకాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​.. కానీ..

ABOUT THE AUTHOR

...view details