తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ చేతుల్లోనే దేశం భద్రం! - రాహుల్ గాంధీ

సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 72.6 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 68 శాతం మంది ప్రజలు పాకిస్థాన్​ కంటే చైనా నుంచే భారత్​కు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.

68% people believe China bigger problem for India than Pakistan: Survey
మోదీ చేతుల్లోనే దేశం భద్రం!

By

Published : Jun 24, 2020, 4:35 AM IST

ప్రస్తుతం చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో జాతీయ భద్రత విషయంలో 72.6% మంది ప్రజలు మోదీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. 14.4% మంది మాత్రమే రాహుల్‌ గాంధీపై నమ్మకాన్ని ప్రదర్శించారు. అయితే, మన సైనికుల ప్రాణాలను బలిగొన్న చైనాపై భారత్‌ ఇప్పటికీ తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకోలేదని 60% మంది అభిప్రాయపడ్డారు. లద్దాక్​లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడానికి సీ-ఓటర్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • సర్వేలో పాల్గొన్న వారిలో 68% మంది ప్రజలు పాకిస్థాన్‌ కంటే చైనా నుంచే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. 32% మంది మాత్రం అందుకు భిన్నమైన భావన వ్యక్తం చేశారు.
  • చైనాకు గట్టిగా బుద్ధి చెప్పడానికి భారత ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించినప్పుడు 39% మంది భారత ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించారు. సైనికుల ప్రాణాలను బలిగొన్న గల్వాన్‌ లోయ దాడి విషయంలో మోదీ ప్రభుత్వం చైనాకు గట్టి హెచ్చరిక చేసినట్లు 20 శాతం మంది చెప్పారు. అయితే, మన సైనికులను చంపిన చైనాపై ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదన్న అభిప్రాయాన్ని 60 శాతం మంది వ్యక్తం చేశారు.
  • 73.6% మంది కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ప్రకటించగా, 16.7% మంది ప్రతిపక్షాల వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో అటు ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రతిపక్షానికి కానీ సామర్థ్యంలేదని 9.6% మంది అభిప్రాయపడ్డారు.
  • మోదీ, రాహుల్‌ గాంధీలను పోల్చినప్పుడు అత్యధికులు మోదీ వైపే మొగ్గు చూపారు. మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమై సరిహద్దులను దుర్భలంగా మార్చిందంటూ దాడి చేస్తున్న రాహుల్‌పై తమకు నమ్మకం లేదని 61% మంది అభిప్రాయపడ్డారు.
  • సర్వే చేసిన వారిలో 68% మంది చైనా వస్తువులను భారత ప్రజలు బహిష్కరిస్తారని భావిస్తుండగా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండా ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేస్తారని 31% మంది అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details