తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చూశాడని పిల్లాడిని కాల్చేశారు

దిల్లీలోని ఇంద్రపురిలో దుండగులు ఓ వ్యాయామశాలపై దాడి చేశారు. ఆ సమయంలో తమను చూశాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని కాల్చి చంపారు. జిమ్​లోకి వస్తున్న మరో యువకుడిపై కాల్పులకు తెగబడ్డారు.

వ్యాయామశాలపై కాల్పుల్లో ఆరేళ్ల బాలుడు మృతి

By

Published : Mar 10, 2019, 10:06 AM IST

Updated : Mar 10, 2019, 11:16 AM IST

దిల్లీలోని ఇంద్రపురిలో దుండగులు కలకలం సృష్టించారు. అక్కడి ఓ వ్యాయామశాలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇతడిని ఆసుపత్రికి తరలించారు.

" మా వ్యాయామశాల​పై దుండగులు కాల్పులు జరిపారు. పైనుంచి చూసిన బాలుడిని కాల్చారు. బయట నుంచి జిమ్​లోకి వస్తున్న మా తమ్ముడిపైనా కాల్పులకు పాల్పడ్డారు. తలకు గాయమవటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం."
- వ్యాయామశాల యజమాని, ఇంద్రపురి

ఇంద్రపురిలోని జేజే కాలనికి చెందిన నలుగురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వ్యాయామశాల పై అంతస్తులో ఉండే బాలుడు కిటికీ నుంచి చూసే క్రమంలో కాల్పులు జరిపారని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

Last Updated : Mar 10, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details