కర్ణాటక కోలార్ జిల్లా మరదగట్టాలో పెను విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నిమజ్జనం కోసం చెరువులోకి ముగ్గురు చిన్నారులు దిగారు. ఊపిరి ఆడక ప్రాణాపాయంలో చిక్కుకోవడం వల్ల వారిని కాపాడేందుకు మరో ముగ్గురు చిన్నారులు దిగి మృతి చెందారు.
ముగ్గురు చిన్నారులు నీటిలో ఊపిరి ఆడక అక్కడిక్కడే చనిపోయారు. సంఘటనను గమనించిన గ్రామస్తులు మిగిలిన ముగ్గురు చిన్నారులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వారు శ్వాస విడిచారు.
చిన్నారులను మృతదేహాలను కేజీఎఫ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తల్లితండ్రుల రోదనలతో ఆసుపత్రి మొత్తం విషాద వాతావరణం నెలకొంది.