తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట తగ్గని కరోనా.. యూపీలో రికార్డు స్థాయిలో... - up corona updates

తమిళనాడులో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. 24 గంటల్లో 5,880 మంది వైరస్ బారినపడ్డారు. మరో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,85,024కి చేరింది. మరోవైపు యూపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. 4,404 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 63 మంది వైరస్​కు బలయ్యారు.

5,880 new COVID19 cases repordted in tamilnadu
తమిళనాడులో తగ్గని కరోనా.. యూపీలో రికార్డు

By

Published : Aug 7, 2020, 7:32 PM IST

తమిళనాడులో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 5,880 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 119 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,85,024కి చేరింది. మృతుల సంఖ్య 4,690కి పెరిగింది. 2,27,575 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

యూపీలో రికార్డు స్థాయిలో..

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో 4,404 కొత్త కేసులు నమోదు కాగా.. 63మంది చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 1,13,378కి చేరింది. మొత్తం 1,981 మందిని వైరస్​ బలిగొంది.

దిల్లీలో..

దేశ రాజధాని దిల్లీలో మరో 1,192మంది వైరస్​ బారినపడ్డారు. కొత్తగా 23మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,42,723కి చేరగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,082కి పెరిగింది.

కశ్మీర్​లో..

జమ్ముకశ్మీర్​లో కొత్తగా నమోదైన 473 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 23,927కి చేరింది. ఇప్పటివరకు 449 మంది వైరస్​ కారణంగా చనిపోయారు.

కేరళలో..

కేరళలో కొత్తగా 1,251మందికి పాజిటివ్​గా తేలింది. మరో ఐదుగురు మరణించారు.

ఇదీ చూడండి: నదుల ఉగ్రరూపం- కొండ చరియలు విరిగి ప్రాణనష్టం

ABOUT THE AUTHOR

...view details