తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాక్​డౌన్ ఎత్తేసినా ప్రార్థనా స్థలాలకు మేం వెళ్లం!'

జూన్ 8 నుంచి లాక్​డౌన్​ ఆంక్షలను పెద్ద ఎత్తున సడలించనున్న నేపథ్యంలో లోకల్ సర్కిల్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత హోటళ్లు, మాల్స్, ప్రార్థనా స్థలాలకు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారనే విషయంపై నెటిజన్లను ప్రశ్నించింది. ఈ సర్వేలో తేలిన విషయాలేంటో మీరూ చూసేయండి.

local circle Survey
'లాక్​డౌన్ ఎత్తేసినా ప్రార్థనా స్థలాలకు మేం వెళ్లం!'

By

Published : Jun 7, 2020, 5:39 AM IST

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​ను కేంద్రం దశలవారీగా సడలిస్తోంది. జూన్ 8 నుంచి 'అన్​లాక్​-1' పేరిట మరిన్ని ఆంక్షలను ఎత్తివేయనుంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థనా స్థలాలను లాక్​డౌన్ నుంచి మినహాయించనుంది.

ఈ నేపథ్యంలో అన్​లాక్-1 ప్రారంభమైన తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారనే విషయంపై 'లోకల్​ సర్కిల్' అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రార్థనా స్థలాలకు వెళ్లాలనుకుంటారా? అని ప్రశ్నించింది. దీనికి 57 శాతం మంది లేదనే సమాధానం ఇచ్చారు. మరో 30 రోజుల వరకు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. భౌతిక దూరం సాధ్యం కాదని.. అందుకే ప్రార్థనా స్థలాలకు వెళ్లడం లేదని పేర్కొన్నారు.

అయితే.. మరో 32 శాతం మంది మాత్రం ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకే మొగ్గు చూపారు. మిగిలిన 11 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాధానమిచ్చారు.

హోటల్​కి వెళ్తారా?

హోటళ్లకు వెళ్లే విషయంపైనా నెటిజన్లు అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఈ ప్రశ్నకు 8,616 మంది సమాధానాలు ఇవ్వగా.. అందులో 81 శాతం మంది.. వచ్చే నెల రోజుల వరకు హోటళ్లకు వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. మరో 10 శాతం మంది మాత్రం తమకు ఇష్టమైన హోటళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు.

మరి మాల్స్​?

మాల్స్​కి వెళ్లి షాపింగ్ చేయకుండా చాలా రోజులే గడిచిపోయింది. సర్వేలో భాగంగా ఈ విషయంపై నెటిజన్లను ప్రశ్నించింది లోకల్ సర్కిల్. దీనికి 70 శాతం మంది మాల్స్​కి వెళ్లబోమని చెప్పగా... 21 శాతం మంది ఆలోచిస్తామని బదులిచ్చారు.

ఆలోచనలో మార్పు!

కరోనావైరస్ భయాల వల్ల ప్రజలు బయటకు రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని లోకల్ సర్కిల్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా పేర్కొన్నారు. కావాల్సిన వస్తువులను ఆన్​లైన్​ ద్వారా ఇంటికి తెప్పించుకునేందుకే ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తపడుతున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details