దిల్లీలో ఇంకా 50 మంది మాజీ ఎంపీలు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీలు స్వతహాగా నివాసాలను వీడకపోతే బలవంతంగా ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరికి ప్రజా ప్రాంగణాల చట్టం ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం ప్రకారం నోటీసు అందిన మూడు రోజుల్లోగా నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.
ఆ 50 మంది మాజీ ఎంపీలపై సర్కార్ గురి! - Public Premises
16వ లోక్‌సభ రద్దయి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ యాభై మందికి పైగా మాజీ ఎంపీలు దిల్లీలో వారికి కేటాయించిన భవనాలను విడిచిపెట్టడం లేదు. అవసరమైతే వీరిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆ 50 మంది మాజీ ఎంపీలపై సర్కార్ గురి!
అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని 200 మాజీ ఎంపీలకు ఆగస్టు 19న లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులను ఇచ్చింది. ఆ తర్వాత దాదాపు 150 మంది ఖాళీ చేయగా... ఇంకా 50 మంది మాజీలు అధికారిక బంగ్లాలలోనే ఉంటున్నారు.
నిబంధనల ప్రకారం లోక్‌సభ రద్దయిన తర్వాత నెల రోజుల్లోగా మాజీ ఎంపీలు తమకు కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయవలసి ఉంటుంది.