ఓ నవజాత మగ శిశువును కుక్కలు పీక్కుతిన్న హృదయవిదారక ఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్ రాఘవ రోడ్డులో ఉన్న ఏరికరై వద్ద కుక్కలు గుంపులుగా ఓ శిశువును పీక్కుతింటున్న దృశ్యాన్ని అక్కడి స్థానికులు చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే తిరువికానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటికే శిశువు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు.
శిశువును పీక్కుతిన్న శునకాలు - శిశువును పీక్కుతిన్న శునకాలు
ఓ శిశువును కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన తమిళనాడు పెరంబూర్ రాఘవ రోడ్డులో జరిగింది. ఆ చిన్నారి పుట్టి అప్పటికి కొన్ని గంటలే అయినట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. శిశువును ప్రాణాలతో వదిలేశారా? లేదంటే మృతదేహాన్ని అలా పడేశారా? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
శిశువును పీక్కుతిన్న శునకాలు
ఆ చిన్నారి పుట్టి అప్పటికి కొన్ని గంటలే అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. శిశువును ప్రాణాలతో వదిలేశారా? లేదంటే మృతదేహాన్ని అలా పడేశారా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చూడండి:రూ.1350 కోట్ల ఆస్తులు స్వాధీనం
TAGGED:
శిశువును పీక్కుతిన్న శునకాలు