చైనా అదుపులోకి తీసుకున్న అరుణాచల్ ప్రదేశ్ యువకులను శనివారం భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
"అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు తమ వద్దే ఉన్నట్లు చైనా అంగీకరించింది. వారిని సెప్టెంబర్ 12న ఓ నిర్దిష్ట ప్రదేశంలో భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది."
-కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి
సుబాన్సిరి జిల్లాలో కస్తూరి జింకల వేటకు వెళ్లిన ఐదుగురు యువకులు సెప్టెంబర్ 4న అదృశ్యమయ్యారు. వారిని సరిహద్దు సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకన్నట్లు మంగళవారం చైనా ధ్రువీకరించింది.