తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి చమురు ప్లాంట్​లో మంటలు- నలుగురు మృతి - ముంబయి

ముంబయిలోని ఓఎన్​జీసీ చమురుశుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. నవీముంబయి ఉరాన్​లోని ప్లాంట్​లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. 22 అగ్నిమాపక బృందాలు రెండు గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేశాయి.

ముంబయి చమురు ప్లాంట్​లో మంటలు- ఐదుగురు మృతి

By

Published : Sep 3, 2019, 11:19 AM IST

Updated : Sep 29, 2019, 6:38 AM IST

ముంబయి చమురు ప్లాంట్​లో మంటలు

ముంబయిలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్​జీసీ) చమురుశుద్ధి కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబయి ఉరాన్​లోని ఓఎన్​జీసీ శీతల గిడ్డంగిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేశారు.

ఓఎన్​జీసీ, నవీ ముంబయికి చెందిన 22 అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు కృషి చేశాయి.

ఈ అగ్నిప్రమాదం... చమురు శుద్ధి కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు అధికారులు. గ్యాస్​ను గుజరాత్​లోని హజీరా ప్లాంట్​కు తరలిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఓఎన్​జీసీ ట్వీట్

ఇదీ చూడండి: 'విక్రమ్'​ తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు

Last Updated : Sep 29, 2019, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details