తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు శాఖలో ఖాళీల భర్తీ ఎప్పుడో..?

2018 జనవరి 1వరకు పోలీసు శాఖలో ఉన్న ఖాళీల వివరాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 5 లక్షల 28వేల 392 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోలీసు శాఖలో ఖాళీల భర్తీ ఎప్పుడో..?

By

Published : Jul 7, 2019, 4:00 PM IST

దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసు శాఖలో దేశ వ్యాప్తంగా 5లక్షల 28వేల 396 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు హోంశాఖ అధికారి తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్​లో 1 లక్ష 29 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 4లక్షల 14వేల 492 పోస్టులున్నాయి. కానీ ప్రస్తుతం 2లక్షల 14వేల 492 మందే విధి నిర్వహణలో ఉన్నారు. నాగాలాండ్​ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసు శాఖలో ఖాళీలున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో ఖాళీలు..( 2018, జనవరి 1 వరకు)

రాష్ట్రం పోస్టులు ఖాళీలు
1 ఉత్తరప్రదేశ్​ 4,14,492 1,28,952
2 బిహార్​ 77,995 50,291
3 బంగాల్​ 1,40,904 48,981
4 తెలంగాణ 76,407 30,345
5 మహారాష్ట్ర 2,40,224 26,195
6 మధ్యప్రదేశ్​ 1,15,731 22,355
7 తమిళనాడు 1,24,130 22,420
8 కర్ణాటక 1,00,243 21,943
9 గుజరాత్​ 1,09,337 21,070
10 ఝార్ఖండ్​ 79,950 18,931
11 రాజస్థాన్​ 1,06,232 18,003
12 ఆంధ్రప్రదేశ్​ 72,176 17,933
13 హరియాణ​ 61,346 16,844
14 ఛత్తీస్​గఢ్​ 71,606 11,916
15 ఒడిశా 66,973 10,322
16 అసోం 65,987 11,452
17 జమ్ముకశ్మీర్​ 87,882 10,044

* నాగాలాండ్​లో ఉన్న పోస్టుల (21,292) కన్నా 941 మంది పోలీసులు ఎక్కువగా ఉన్నారు.

ఇన్ని ఖాళీలు ఎలా?

నియామక ప్రక్రియలో మందగమనం, పదవీవిరమణ, అకాల మరణాల వల్లే ఇన్ని ఖాళీలున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఖాళీలను పూరిస్తే ఆ సమస్యను కొంతమేరకు అధిగమించవచ్చని యువత కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: 14 అడుగుల నాగుపామును చూసి జనం షాక్

ABOUT THE AUTHOR

...view details