ముంబయి మింట్ రోడ్డులో ఆరు అంతస్తుల భవనంలోని కొంత భాగం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల్లో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
భవనం కూలిన ఘటనలో ఆరుగురు మృతి - maharashtra news
ముంబయిలో ఆరు అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 23 మందిని రక్షించారు సహాయక సిబ్బంది. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆరు అంతస్తుల భవనం కూలిన ఘటన
గురువారం సాయంత్రం 4:45 గంటలకు మింట్ రోడ్డులోని భానుషాలి భవనంలోని 30-40 శాతం భాగం కుప్పకూలింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
Last Updated : Jul 17, 2020, 7:38 AM IST