తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3 గంటల్లో 474 మంది మందుబాబులు  అరెస్టు

ఉత్తర్​ప్రదేశ్​లోని  నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో శనివారం రాత్రి  మూడు గంటల్లోనే 474 మంది మందు బాబులు అరెస్టయ్యారు. వీరిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారు, డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో చిక్కినవారు ఉన్నారు.

3 గంటల్లో 474 మంది మందుబాబుల  అరెస్టు

By

Published : Jul 7, 2019, 6:14 AM IST

Updated : Jul 7, 2019, 7:59 AM IST

ఉత్తర్​ప్రదేశ్ గౌతమ్​బుద్ధ నగర్​ జిల్లాలో శనివారం రాత్రి పోలీసులు యాంటీ లిక్కర్​(మద్య వ్యతిరేక తనిఖీ) డ్రైవ్​ నిర్వహించారు. కేవలం మూడు గంటల్లోనే 474 మంది మందు బాబులను అరెస్టు చేశారు. పట్టణ ప్రాంతంలో 241 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 233 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బహిరంగ ప్రదేశాలు, మద్యం దుకాణాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్​ అండ్ డ్రై వ్ తనిఖీల్లో 15 మంది పట్టుబడ్డారు.

నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో 52 చెక్​ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్​ వైభవ్​ కృష్ణ చెప్పారు. ఈ ప్రాంతాల్లోనే వీరందరిని అరెస్టు చేసినట్లు వివరించారు. భారత శిక్షా స్మృతి సెక్షన్​ 290, సెక్షన్​ 34 కింద కేసులు నమోదు చేశామన్నారు.

ఇదీ చూడండి: అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం

Last Updated : Jul 7, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details