మన భావాన్ని వ్యక్తీకరించడానికి భాష ప్రధానం. అయితే.. ఛత్తీస్‌గఢ్ జశ్పుర్కు చెందిన 45 ఏళ్ల చంద్రసేనకు ఇదే సమస్యగా మారింది. ఆమెకు ఒక కుమారుడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే జపాన్‌కు చెందిన మియాకాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె అమీకా. అయితే సమస్యొచ్చింది ఇక్కడే.
వారితో మాట్లాడాలంటే చంద్రసేనకు కష్టంగా అనిపించేది. ఎందుకంటే వారికేమో ఆంగ్లం, జపనీస్ తప్ప మరేమీ రాదు. చంద్రసేనకు హిందీనే వచ్చు. అయితే.. ఓ ఆలోచన ఆ సమస్యను పరిష్కరించగలిగింది. ఆంగ్ల భాషపై శిక్షణ తీసుకోవాలని ఆమె భావించారు. అనుకోవడమే ఆలస్యం భర్త సహకారంతో శిక్షణ తరగతిలో చేరారు. ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆమె ప్రయత్నాన్ని తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేటు.. కోచింగ్ సెంటర్‌ను సందర్శించి చంద్రసేనను ప్రోత్సహించారు.