తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏపీ, ఒడిశా​ మీదుగా 4 వేల కి.మీ రైల్వే కారిడార్!

దేశంలోని తూర్పు, పశ్చిమ పారిశ్రామిక ప్రాంతాలతో దక్షిణ భారత్​ను అనుసంధానించేలా 4 వేల కి.మీల ప్రత్యేక రవాణా కారిడార్​ను నిర్మించేందుకు రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన ఓడరేవుల ద్వారా అనుసంధానం ఏర్పరిచేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.

4,000-km DFC planned to connect industries in east, west to south via Andhra, Odisha ports
ఆంధ్రప్రదేశ్​ మీదుగా 4 వేల కి.మీ రైల్వే రవాణా కారిడార్!

By

Published : Aug 17, 2020, 6:11 PM IST

దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో రవాణా కారిడార్లను నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. తూర్పు, పశ్చిమ భారతదేశంలోని పారిశ్రామిక ప్రాంతాలతో దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించాలని భావిస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన ఓడరేవుల ద్వారా ఈ కనెక్టివిటీ ఏర్పరచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇందుకు సంబంధించి 4 వేల కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్(​డీఎఫ్​సీ)ను నిర్మించనున్నట్లు ప్రభుత్వ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రైల్వే చేపట్టే అతిపెద్ద మౌలిక వసతుల కార్యక్రమాల్లో ఈ డీఎఫ్​సీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా నిర్మించే కారిడార్​ల వివరాలు

  • తూర్పు తీర కారిడార్(1,115 కి.మీ)​:ఖరగ్​పుర్​(బంగాల్) నుంచి విజయవాడ(ఏపీ) వరకు.
  • తూర్పు పశ్చిమ కారిడార్(1,673 కి.మీ):భుసావల్-నాగ్​పుర్​(మహారాష్ట్ర) నుంచి ఖరగ్​పుర్​-డన్​కునీ(బంగాల్) వరకు, రాజ్ఖర్స్వాన్(ఝార్ఖండ్)-కాలీ పహాడీ(రాజస్థాన్)- అండాల్(బంగాల్) మధ్య 195 కి.మీ మార్గం.
  • ఉత్తర దక్షిణ ఉప కారిడార్(975 కి.మీ):విజయవాడ-నాగ్​పుర్-ఇటార్సీ(మధ్యప్రదేశ్) మార్గంలో మూడోది.

ఈ కారిడార్ల నిర్మాణం కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీఎఫ్​సీసీఐఎల్) త్వరలో సర్వే చేపట్టనుంది. ఏడాది వ్యవధిలో సర్వేను పూర్తి చేయనుంది.

అనుసంధానంతో రవాణా వేగం

ఈ కారిడార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. మరోవైపు ఒడిశాలో పారాదీప్, ధమ్రా, గోపాల్​పుర్​ ఓడరేవుల మధ్య అనుసంధానం ఏర్పరుస్తుంది. ఫలితంగా వస్తు రవాణాలో వేగం పుంజుకుంటుంది. దీంతో రైల్వే వ్యవస్థ సామర్థ్యం మెరుగవుతుంది.

ఇవి కాకుండా ఇప్పటికే రెండు రవాణా కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభించింది డీఎఫ్​సీసీఐఎల్. లూధియానా నుంచి డన్​కునీ(1,856 కి.మీ) వరకు తూర్పు కారిడార్, దాద్రి(యూపీ) నుంచి జవహర్​లాల్ నెహ్రూ పోర్ట్(మహారాష్ట్ర-1,504 కి.మీ) వరకు పశ్చిమ కారిడార్​ పనులు మొదలుపెట్టింది. రూ. 81 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు 2021నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:కరోనా కష్టాలు: వర్షంలో సైకిల్​పై అంతిమయాత్ర!

ABOUT THE AUTHOR

...view details