వాయు కాలుష్యం కారణంగా దిల్లీ, దేశ రాజధాని ప్రాంతం..ఎన్సీఆర్ నుంచి 40 శాతం మంది వేరే నగరానికి తరలిపోవాలని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరో 16 శాతం మంది వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో దిల్లీ నుంచి వేరే చోటుకు పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
13 శాతం మంది తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాయు కాలుష్యం పెరిగినా దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 31 శాతం మంది ప్రజలు ఎయిర్ ఫ్యూరిఫైయర్లు, మాస్క్‌ల ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటూ దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్ వేదిక లోకల్ సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది.